పరకాల: అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth )మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి అమలు చేయాలన్నారు. త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో మాదిగలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిలువేరు ప్రవీణ్, ఉపాధ్యక్షులు కొమ్ముల చిరంజీవి చిలువేరు నరేష్, ప్రధాన కార్యదర్శి హనుమకొండ విజయ్ కుమార్, కామరెడ్డి పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు పసుల రాజశేఖర్ మాదిగ నాగారం గ్రామ శాఖ అధ్యక్షుడు ఇనుముల కృష్ణ, పోచారం గ్రామ శాఖ అధ్యక్షుడు దొమ్మడి సురేంద్ర, మల్లక్కపేట గ్రామ శాఖ అధ్యక్షుడు మంగళపల్లి రాజు, వెంకటాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలువేరుభాను తదితరులు పాల్గొన్నారు.