హనుమకొండ: హనుమకొండలోని (Hanumakonda) సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున ఇన్నోవా కారును తప్పించబోయిన గ్రానైట్ లారీ డ్రైవర్ డివైడర్‌ను ఎక్కించాడు. ఆ సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. లారీ డ్రైవర్‌తోపాటు, కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో సేఫ్ గా బయట పడ్డారు.
అయితే ఇన్నోవా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, లారీని గమనించకుండా కారును తోలడంతోనే ప్రమాదం జరిగినదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సుబేదారి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం కారణంగా గ్రానైట్ బండలు లారీ పైనుంచి కింద పడ్డాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పోల్స్, సీసీ కెమెరాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో లారీ ముందు, వెనుక వాహనాలు ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అని పోలీసులు చెప్పారు.