Bachhannapeta | పదో తరగతి టాపర్లకు నగదు బహుమతులు అందజేస్తాం : నీల కవిత
పదో తరగతి టాపర్లకు నగదు బహుమతులు అందజేస్తాం అని సర్పంచ్ నీల కవిత అన్నారు.
బచ్చన్నపేట, మార్చి 11 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు నరసింహ స్వామి అధ్యక్షత వహించగా గ్రామ సర్పంచ్ నీల కవిత ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలలో స్కూల్ టాపర్ కి 2000 రూపాయలు మండల టాపర్‌కు 5000 రూపాయలు, జిల్లా టాపర్ కి 10000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరారు.
మంచి రిజల్ట్స్ సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మంచి పౌరులుగా ఎదగాలని కోరారు. అనంతరం 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష ప్యాడులను బహుకరించారు. ఈ సమావేశంలో ఏఏపీసీ చైర్మన్ కొత్త పల్లి అంజమ్మ, ఉపాధ్యాయులు యాదగిరి, ఎస్ కిషన్, మహమ్మద్ అoకుషావలి, వి రఘుమూర్తి, ఏ ప్రభాకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

