హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 27: పట్టు విడిసేది లేదు… జెండా వదిలేది లేదని అలసటలేని ప్రయాణం.. అంతిమంగా కూడా బీఆర్ఎస్ రాష్ర్ట సమితితోనని బీఆర్ఎస్ పశ్చిమ కోర్డినేటర్ పులి రజినీకాంత్ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని 10వ డివిజన్ మచిలీబజార్ పార్టీ ఆఫీస్ జంక్షన్లో ఆయన జెండా ఎగురవేశారు.
అనంతరం స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ ఖలీల్, మాజీ కార్పొరేటర్ ఉడతాల సారంగపాణి, నాయీముద్దీన్, చుంచు వెంకన్న, హైమావతీ, ఖాజా, సంపతీ రఘు, పులి రవీందర్, అనిల్, మాడిశెట్టి వరుణ్, పర్వీజ్, యాస్మీన్, పులి సందీప్, అహ్మద్, రాజేశ్వరి, శ్యామ్, కేతా, కృష్ణ, అజమాత్, శ్రీనివాస్, రాజేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.