హనుమకొండ చౌరస్తా, జనవరి 16: మేడారం జాతరకు విశేషంగా జనాదారణ ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమమకొండలోని యూనియన్ కార్యాలయంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు పున్నంచందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఆసియాలోనే పెద్దదైన గిరిజన జాతరగా పేరొందిన మేడారానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. కాబట్టి.. మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలో మూడురోజులు అధికారిక సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని పులి దేవేందర్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ రావులకార్ వెంకటేష్, రాష్ర్ట నాయకులు దావు రమేష్, జిల్లా అధ్యక్షుడు పున్నంచదర్ సురేష్ పాల్గొన్నారు.