హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 6 : ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా ఉంది హనుమకొండలోని బుద్ధభవన్ ప్రజల పరిస్థితి.. నగరం ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికి ఇంకా ఏదో స్లమ్ ఏరియాలో ఉంటున్నట్లుగా భావిస్తున్నారు ఆ కాలనీ ప్రజలు.. ఇదిగో రోడ్డు.. అదిగో రోడ్డు విస్తరణ పనులు దశాబ్దాలుగా ఎదురుచూసిన ప్రజలు ‘కల’గానే మిగిలిపోయింది. పేదల ప్రజల కోసం ఎంతో కృషి చేసిన కామ్రేడ్ బీఆర్ భగవాన్‌దాస్ కల హనుమకొండ బస్ స్టషన్ వయా బుద్ధభవన్ మీదుగా బస్సులను నడిపించాలనే వారి ఆశయాలు కలగానే మిగిలిపోతున్నాయి.
కుమార్‌పల్లి బుద్ధభవన్ రోడ్ విస్తర్ణకు మోక్షం లభించడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఏడాదిలోపే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చొరవతో బుద్ధభవన్ రోడ్డు విస్తరణకు తొలి అడుగులు పడ్డాయని స్థానికులు సంబురాలు ఆదిలోనే అంతమైపోయినట్లు కనిపిస్తోంది. రాజకీయ నాయకుల అలసత్వం, నిధుల కొరత లాంటి అనేక కారణాలతో నిలిచిన బుద్ధభవన్ రోడ్డు విస్తరణ పనులు ఈ సారైనా జరిగేనా అన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
సుమారు దశాబ్దకాలం క్రితం ప్రారంభమైన విస్తరణ పనులకు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రస్తుతం అనేక ఒత్తిళ్లకు తలొగ్గకుండా, అడ్డంకులను అధికమించి, ప్రణాళిక ప్రకారం రోడ్డును అభివృద్ధి చేస్తారా, గత ప్రభుత్వం మాదిరిగానే అలా ప్రారంభించి ఇలా వదిలేస్తారా అన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
ఇరుకుగా మారిన కాంగ్రెస్ భవన్..
కాంగ్రెస్ భవన్ రోడ్డు ఇరుకుగా మారింది. రోడ్డును విస్తరించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. నిత్యం కాంగ్రెస్ సమావేశాలు, ప్రముఖుల రాకతో కాంగ్రెస్ భవన్ రోడ్డు రద్దీగా ఏర్పడుతుంది. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. ఆ సమయంలో అటువైపు వెళ్లే వాహనదారులకు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ భవన్ వద్దనే తారు రోడ్డు వేసి ముస్తాబు చేసుకున్న ఎమ్మెల్యేకు స్లమ్ ఏరియాలో ఉండే ప్రజలు కనిపించడంలేదా అని ప్రశ్నిస్తున్నారు.
40 ఫీట్ల రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
నగరం అభివృద్ధి చెందుతున్న వేళ రోజురోజుకు ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రోడ్డు విస్తరణ తప్పనిసరి. ఇటీవల జరిగిన వరంగల్ మహానగర మాస్టర్ ప్లాన్‌పై నిర్వహించిన సమీక్షలో
ప్రణాళికలు సైతం రూపొందించినట్లు తెలుస్తోంది. కుడా ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో కాంగ్రెస్ భవన్ నుంచి బుద్దభవన్ మీదుగా కేయూ బైపాస్ రోడ్డుకు చేరుకునేలా 40 ఫీట్ల రోడ్డు వేసేందుకు అధికారులు రూపొందించిన విస్తరణకు గ్రీన్ సిగ్నల్ పడినట్లుగా వెల్లడించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి రోడ్డు విస్తరణకు చొరవ చూపించడంలేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. బుద్ధభవన్ రోడ్డుకు ఇరువైపులా కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చినప్పటికీ రోడ్డుకు మోక్షం లభించడంలేదు.
పూర్తయిన కల్వర్టులు.. ప్యాచ్‌లతో మమ..
బుద్ధభవన్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కాంగ్రెస్ భవన్ నుంచి బుద్ధభవన్‌కు వెళ్లే దారిలో ఏ-వన్ మటన్ షాప్ వద్ద రెండు వైపులా కల్వర్టుల నిర్మాణం పనులు పూర్తి చేశారు. ఇంకా ఆ రోడ్డులో కల్వర్టులు చకచకా వేశారు. ప్రమాదకరంగా మారిన కల్వర్టులకు ఇరువైపులా తార్‌తో ప్యాచ్ వర్క్ చేసి మమ అనిపించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే కల్వర్టులు నిర్మించారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నా ఇంకా రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించకపోవడంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇరుకుగా మారిన కాంగ్రెస్ భవన్..
కాంగ్రెస్ భవన్ రోడ్డు ఇరుక్కుగా మారింది. రోడ్డును విస్తరించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. నిత్యం కాంగ్రెస్ సమావేశాలు, ప్రముఖుల రాకతో కాంగ్రెస్ భవన్ రోడ్డు రద్దీగా ఏర్పడుతుంది. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. ఆ సమయంలో అటువైపు వెళ్లే వాహనదారులకు, ప్రజలు అవస్థలు పడాల్సిందే. కాంగ్రెస్ భవన్ వద్దనే తారు రోడ్డు వేసి ముస్తాబు చేసుకున్న ఎమ్మెల్యేకు స్లమ్ ఏరియాలో ఉండే ప్రజలు కనిపించడంలేదా అని ప్రశ్నిస్తున్నారు.
పతిపాదనలు ప్రకటనలకే పరిమితం
హనుమకొండలోని కాంగ్రెస్ భవన్ నుంచి కేయూ బైపాస్ రోడ్డు వరకు బీటీ రోడ్డు వేసేందుకు పదేళ్ల క్రితం సీఎం నిధుల నుంచి సుమారు రూ.2 కోట్లను కేటాయించినట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ గ్రహణం, నిధులు విడుదల చేయకపోవడంతో విస్తరణ ప్రతిపాదనలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. బుద్ధభవన్రోడ్డు కంకరతేలి, గుంతలమయంగా మారింది.
దశాబ్దాల క్రితం రోడ్డు విస్తరణ కోసం మధ్యలో ఉన్న కొన్ని ఇళ్లను తొలిగించి వారికి ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో కేటాయించారు. అప్పుడు ఎంతో ఆర్భాటంగా చేసిన పనులు ఇప్పుడు ఎందుకు చేయడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు విస్తర్ణకు అడ్డుగా మారిన పలు ఇళ్లను తొలిగించి రోడ్డు వేయాలని ప్రజలు పలుమార్లు ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా చొరవ చూపడంలేదని ప్రజలు ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు.