హనుకొండ చౌరస్తా : మహిళల హక్కుల కోసం మహిళలు సంఘటితం కావాలని బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మజాదేవి అన్నారు. గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో బీసీ మహిళా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మాడిశెట్టి అరుంధతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 8న ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు హన్మకొండ, వడ్డేపల్లి రోడ్ కనకదుర్గకాలనీ వైష్ణవి బ్యాంకట్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ఉత్తమ మహిళలను మెమెంటో, శాలువతో ఘనంగా సత్కరించునట్లు చెప్పారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, విశిష్ట అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవి కృష్ణ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణి మంజరి, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుండి బీసీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీ మహిళా సంఘం సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మల శోభరాణి, జిల్లా బీసీ మహిళా నాయకురాలు బూర్గుల ప్రమదదేవి పర్స హైమ, సూర స్రవంతి, నాయిని సరస్వతి పాల్గొన్నారు.