భీమదేవరపల్లి, మార్చి 29: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు శనివారం వంగర ప్రభుత్వ వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారిణి రుబీనా మాట్లాడుతూ వేకువ జామునే పనులు చేసుకోవాలని కూలీలకు సూచించారు. ఎండ వేడిమి పడకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. తరచూ నీరు తాగాలని, ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం గాజుల స్వరూప, ఆశా కార్యకర్త బొంకూరి అన్నపూర్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ వేణు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.