ఆత్మకూరు, జూన్ 13: హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ శివారులో ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి వృద్ధురాలు మృతిచెందింది.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట పంచాయతీ పరిధిలోని రాజిరెడ్డిపల్లికి చెందని బోలకొండ నరహరి, సౌభాగ్య(64) దంపతులు శనివారం ఉదయం హనుమకొండకు బయల్దేరారు. నీరుకుళ్ల శివారు పత్తిపాక క్రాస్ వద్ద ద్విచక్రవాహం అదుపుతప్పడంతో వెనుక కూర్చున్న సౌభాగ్య కిందపడింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో సౌభాగ్య అక్కడికక్కడే మరణించింది. బైక్ నడిపిన నరహరికి తీవ్రగాయాలు కావడంతో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.