New Shayampet : న్యూ శాయంపేట నగరంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆటో డ్రైవర్ గుండు రాజు కుటుంబానికి శ్రీ రాజరాజేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్లు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు వేల్పుల సాంబమూర్తి మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల కష్ట సుఖాలలో, సమస్యల పరిష్కారంలో గుండు రాజు ముందుండేవాడు అన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే రాజు మరణించడం బాధాకరం అన్నారు. ఆటో డ్రైవర్ల నుంచి సేకరించిన 30 వేల నగదు తో పాటు క్వింటాలు బియ్యంను మృతుడి కుటుంబానికి అంద జేశామని తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు గుండు గోవర్ధన్, కోశాధికారి రాస మల్ల సురేష్, బి లక్ష్మణ్, ప్రతాప్, పున్నం, కిషన్, తదితరులతో పాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.