హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 13: మార్చి 16, 17 తేదీలలో కాకతీయ విశ్వవిద్యాలయ రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘కరెంట్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు పోస్టర్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విభాగాధిపతి ఎన్.వాసుదేవరెడ్డి, డీన్ జి.హనుమంతు, టి.సవితాజ్యోత్స్న, ఎస్.జ్యోతి, పాలక మండలి సభ్యురాలు బి. రమ, ఆర్.మల్లికార్జున రెడ్డి, కె.మమత, ఎస్.రంగారెడ్డి, ఎన్.శ్రీనివాస్, కవిత, వినుత, నాగేశ్వర్రావు, సృజన, విభాగ బోధనా సిబ్బంది పాల్గొన్నారు. ఈ జాతీయ సదస్సు ద్వారా రసాయన శాస్త్రంలో తాజా పరిశోధన ధోరణులు, ఆధునిక ఆవిష్కరణలు, శాస్త్రీయ అభివృద్ధిపై విశ్లేషణాత్మక చర్చలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.