ఐనవోలు (హనుమకొండ): తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్(ట్రస్మా) ప్రధాన కార్యదర్శిగా ఐనవోలు ఫాత్ ఫైండర్ కరస్పాండెంట్ డాక్టర్ నడిపల్లి వెంకటేశ్వర్ రావు (Nadipalli Venkateshwar Rao) నియమితులయ్యారు. హైదరాబాద్లో సోమవారం ట్రస్మా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన 31 జిల్లాల నుంచి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు, సీనియర్ కరెస్పాండెంట్లు ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ నడిపల్లి వెంకటేశ్వర్ రావును ఎంపిక చేశారు. తనను ట్రస్మా ప్రధాన కార్యదర్శికగా నియమించిన తర్వాత వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన అన్ని జిల్లా పాలకవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.