Cold Wave | హైదరాబాద్ : ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్‌పై చలి పులి పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే గత మూడు నాలుగు రోజులుగా నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు 13.8 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 29.6 డిగ్రీలు, గాలిలో తేమ 40 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల మరో మూడు నాలుగు రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.