Vaibhav Surayvanshi : భారత బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Surayvanshi) రికార్డు శతకాలతో హోరెత్తిస్తున్నాడు. ఐపీఎల్లో రెండో వేగవంతమైన సెంచరీ బాదిన ఈ చిచ్చరపిడుగు.. అండర్ 19 మ్యాచుల్లోనూ చెలరేగిపోతున్నాయి. తాజాగా ఏసీసీ పురుషుల రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో మెరుపు శతకంతో వార్తల్లో నిలిచాడు. క్రికెట్లో కొత్త రికార్డులు నెలకొల్పుతున్న ఈ యంగ్‌స్టర్ తన తండ్రి గురించి ఆసక్తికర విషయ చెప్పాడు. తాను రెండొందలు కొట్టినా సరే నాన్న సంతృప్తి చెందడు అని వైభవ్ అన్నాడు.
‘నా ప్రదర్శన పట్ల మా నాన్న సంజీవ్ సూర్యవంశీ ఎప్పుడూ సంతృప్తి చెందరు. ఒకవేళ నేను 200 కొట్టినా కూడా మరో పది పరుగులు చేయాల్సింది అంటారు. కానీ, మా అమ్మ మాత్రం నా ఆట చూసి చాలా సంతోషపడుతుంది. నేను శతకం బాదినా లేదా డకౌట్ అయినా సరే ఆమె ఏమీ అనదు. మరింత మంచిగా ఆడు అని చెబుతుంది’ అని బీసీసీఐ వీడియోలో వైభవ్ వెల్లడించాడు.
Teen sensation Vaibhav Suryavanshi continues to set the world alight – a 32-ball century in the Asia Cup Rising Stars 🔥 pic.twitter.com/lOgarLlwJY
— ESPNcricinfo (@ESPNcricinfo) November 14, 2025
అంతేకాదు భావితారగా ఎదుగుతున్న తాను ఏదీ అసాధారణంగా చేయను అంటున్నాడు వైభవ్. ‘నేను ఏదీ అసాధారణంగా చేయను. నా చిన్నతనం నుంచి నేర్చుకున్న విషయాలపైనే దృష్టి పెడుతా. నేను పడిన కష్టం ఇప్పుడు ఫలితాలనిస్తోంది. మైదానంలోకి దిగినప్పుడు నా సహజసిద్ధమైన ఆట ఆడుతాను. నేను మరోకొద్ది సేపు క్రీజులో నిలిస్తే.. మరో 20 నుంచి 30 పరుగులు చేస్తాను. దాంతో.. వ్యక్తిగత రికార్డు సాధిస్తాను’ అని ఈ సెన్సేషనల్ క్రికెటర్ వివరించాడు.
𝘽𝙚𝙞𝙣𝙜 𝙑𝙖𝙞𝙗𝙝𝙖𝙫 𝙎𝙤𝙤𝙧𝙮𝙖𝙫𝙖𝙣𝙨𝙝𝙞 🫶
🎥🔽 A peek into the strong mindset of a special talent 👌 – By @ameyatilak
https://t.co/y0yiu3E5qV#RisingStarsAsiaCup— BCCI (@BCCI) November 15, 2025
ఐపీఎల్ 18వ సీజన్లో మెరుపు సెంచరీతో వార్తల్లో నిలిచిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మళ్లీ చెలరేగిపోయాడు. అండర్ -19 విభాగంలో రెచ్చిపోయి ఆడుతున్న ఈ యంగ్‌స్టర్ అసియాకప్ రైజింగ్ స్టార్స్ (Asia Cup Rising Stars) టోర్నీలో ఊచకోతకు తెగబడ్డాడు. ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 32 బంతుల్లోనే శతకగర్జన చేశాడు. ఆకాశమే హద్దుగా దంచేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 10 ఫోర్లు, 9 సిక్సర్లతో మూడంకెల స్కోర్ అందుకున్నాడు.