హైదరాబాద్ : కాప్రా డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బైరీ నవీన్ గౌడ్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో బైరీ నవీన్ గౌడ్‌ను కాప్రా డివిజన్ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నవీన్ గౌడ్‌కు నియామక పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బైరీ నవీన్ గౌడ్ రాజకీయ జీవితం యూత్ కాంగ్రెస్ నుంచి ప్రారంభమైందన్నారు. ఇవాళ బీఎల్ఆర్ ట్రస్ట్ ఇంచార్జీగా సేవలందిస్తున్నారు. ఎల్లారెడ్డిగూడ గ్రామ సేవా సంఘం అధ్యక్షులుగా విశిష్ఠమైన సేవలందించారని కొనియాడారు. రాజకీయాల్లో అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నవీన్ గౌడ్‌ను కాప్రా డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించడంతో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ఈ సందర్భంగా నవీన్ గౌడ్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం బైరీ నవీన్ గౌడ్ మాట్లాడుతూ.. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తనపై నమ్మకం ఉంచి కాప్రా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.