FIFA World Cup : ప్రతిష్ఠాత్మక ఫిఫా వరల్డ్ కప్ 2026 పోటీల కు క్రొయేషియా (Croatia) అర్హత సాధించింది. శనివారం ఫరో ఐస్లాండ్ జట్టుపై 3-1తో గెలుపొందడంతో బెర్తు ఖరారు చేసుకుంది. యూరప్ దేశాలైన జర్మనీ(Germany), నెదర్లాండ్స్ (Netherlands) సైతం మరింత చేరువయ్యాయి. లక్జెంబర్గ్ను 2-0తో ఓడించిన ఆ జట్టు గ్రూప్ ఏ నుంచి అగ్రస్థానంలో ఉంది. పొలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఒక పాయింట్ సాధించిన డచ్ జట్టు బెర్తుకు మరింత దగ్గరైంది. ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా సరే ప్రపంచకప్ బరిలో నిలుస్తాయి.
ఇప్పటివరకూ 30 జట్లు ఫిఫా వరల్డ్ కప్ బెర్తు సాధించాయి. వీటిలో ఆతిథ్య జట్లు కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. ఆసియా నుంచి ఆస్ట్రియా, ఇరాన్, జపాన్, జోర్డాన్, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్ జట్లు క్వాలిఫై అయ్యాయి.
QUALIFIED! Croatia are heading back to the biggest stage. 🏆 #FIFAWorldCup pic.twitter.com/c2bGPnU66i
— FIFA World Cup (@FIFAWorldCup) November 14, 2025
ఆఫ్రికా క్వాలిఫయర్స్ ద్వారా అల్జీరియా, కేప్ వెర్డే, ఈజిప్ట్, ఘనా, ఐవరీకోస్ట్, మొరాకో, సెనగల్, దక్షిణాఫ్రికా, ట్యూనీషియాలు బెర్తు కైవసం చేసుకున్నాయి. యూరప్ నుంచి ఇంగ్లండ్, ఫ్రాన్స్, క్రొయేషియా, ఓసియనియా నుంచి న్యూజిలాండ్‌కు బెర్తు దక్కింది. దక్షిణ అమెరికా ఖండం నుంచి అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, ఉరుగ్వే ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించాయి.