నయీంనగర్, నవంబర్14 : అధునాతన మోడ ల్స్, సరికొత్త ఫీచర్స్‌తో కూడిన బ్రాండెడ్ కార్లు, బైక్‌ల ప్రదర్శనకు హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానం వేదిక కానున్నది. శనివారం, ఆదివారం ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహణకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ ప్రాపర్టీ షోలో మారుతి సుజూకి, టీవీఎస్, నెక్సా, కియా, ఎంజీ, హ్యుందయ్, టాటా, సి ట్రాన్, హోండా, టయో టా, కిట్రాన్, యమహాలతో పాటు అనేక కంపెనీలు ఈ ప్రాపర్టీషోలో పాల్గొని తమ వాహనాలను ప్రదర్శించడమే కాకుండా వినియోగదారుల అభిరుచుల మేరకు అమ్మకాలు నిర్వహించనున్నారు. 20కి పైగా కార్ల కంపెనీలతో పాటు ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నాయి. కార్లు, మోటార్ బైక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే వేదికపైకి వస్తుండడంతో వీటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఆటో షోలోనే బుక్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
ఒక వాహనం కొనాలంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న షోరూంలకు పోయి వాటి వివరాలు తెలుసు కుంటాం. కానీ ఈ ప్రాపర్టీ షోలో అందుకు భిన్నంగా అన్ని వాహన కంపెనీలు, వారు తయారు చేసిన వివిధ మోడల్స్ ద్విచక్ర వాహనాలు, కార్లు ఒకే వేదికపై ప్రదర్శించడంతో పాటు అమ్మకాలు జరుపుతా రు. ఆసక్తి ఉన్న వారు వరంగల్‌లోనే వీటిని సొంతం చేసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సువర్ణావకాశం కల్పిస్తున్నది. కొనుగోలుదారులకు లోన్ సౌకర్యం కల్పించేందుకు వివిధ బ్యాంక్ లు సైతం అందుబాటులో ఉండనున్నాయి. ఎస్బీఐ, కెనరా, డీసీసీబీ, సెంట్రల్ బ్యాంక్‌తో పాటు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆటో షోలో తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నాయి.