Organic Products | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 1: ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించే దిశగా, సేంద్రియ వ్యవసాయం, చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శనివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో జాతీయ ఆర్గానిక్ రైతుల సంతను వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేంద్రియ ఉత్పత్తుల వినియోగం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని, గ్రామీణ రైతులు ఉత్పత్తి చేసే ఆర్గానిక్ ఆహార పదార్థాలు, నేటి మారుతున్న మోడరన్ ఫుడ్ కంటే ఎంతో మెరుగైనవి అన్నారు. ఈ సంత ద్వారా స్థానిక రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, వినియోగదారులు కూడా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా రైతుల వద్ద నుండే పొందగలరని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు.
రైతులు, చేనేత కార్మికులు, గిరిజన కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి ఉత్పత్తుల ప్రత్యేకతలు, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారు ప్రదర్శించిన సేంద్రియ పంటలు, చేనేత వస్త్రాలు, గిరిజన హస్తకళా ఉత్పత్తులను ఎమ్మెల్యే నాయిని అభినందించారు.
Actress | భిక్షాటనతో జీవనాన్ని సాగిస్తున్న నటి.. కంటతడి పెట్టిస్తున్న నుపుర్ అలంకార్ కథ
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9లో మరో ట్విస్ట్ .. శ్రీజ ఎలిమినేషన్, కొత్త కెప్టెన్‌గా దివ్య!
NTR | గాయాల నుండి పూర్తిగా కోలుకున్నఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్ భారీ షెడ్యూల్ ఎప్పటి నుండి అంటే..!