పర్వతగిరి : చిన్నప్పటి నుంచే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఎంపీఓ శేషాంజన్ స్వామి అన్నారు.స్నేహ గ్రామ సభ పర్వతగిరి మండలం కొంకపాక గ్రామంలో నిర్వహించారు. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా శేషాంజన్ స్వామి విచ్చేసి మాట్లాడారు. పిల్లలు మంచి నడవడిక కలిగి భవిష్యత్తులో మంచి చదువులు చదివి గొప్ప వ్యక్తులు కావాలన్నారు. ఐకేపీ సీసీ రవీందర్ రాజు మాట్లాడుతూ గత 11 వారాలలో 11 అంశాలను నేర్చుకున్నారు.
వాటిని మీరు మంచిగా ఉపయోగించుకోవాలని, మీకు ఉన్న గోల్స్ ను చేరుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమాలలో జీపీ కార్యదర్శి సదానందం, వివో అధ్యక్షురాలు ఎండీ ఫరీద, శేషమ్మ, హిమబిందు, వివోఏలు సంధ్యారాణి, సంతోష, గ్రామ పెద్దలు, ఫీల్డ్ అసిస్టెంట్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.