వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆవేదనతో భార్య ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆవేదనతో భార్య ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఎలుకుర్తి హవేలీ గ్రామంలో ఉంటూ, హన్మకొండ జిల్లా బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన మమత (30) అనే యువతిని ఈరెల్లి సుమన్ అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుమన్ ఊరిలో కూలీ పనులు చేస్తుండగా మమత నర్సంపేటలోని ప్రైవేట్ కంటి దవాఖానలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలు హరిణి (4), కావ్యశ్రీ (3)తో కలిసి కలిసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
కాగా, కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన పెళ్లయిన మహిళతో సుమన్ వివాహేతర సంబంధం పెట్టుకుని, 20 రోజుల క్రితం ఆమెతో కలిసి వెళ్లిపోయాడు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా సుమన్ భార్యతోనే ఉండాలని తీర్మానించడంతో కొన్ని రోజులుగా నర్సంపేట మండలం ముగ్ధుంపురంలోని బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే, సుమన్ మరోసారి సదరు వివాహితతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తిరిగి ఎలుకుర్తి హవేలీకి వచ్చింది.
సదరు వివాహిత బంధువులతో కలిసి ఇంటికి వచ్చి మమతను దారుణంగా దూషించడంతో అవమానం తట్టుకోలేక, ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి పిల్లలతో సహా బయలుదేరిన మమత పాకాల చెరువు వద్దకు చేరుకుని, హైదరాబాద్‌లో ఉండే బంధువులకు చనిపోతున్నానని ఫోన్లో చెప్పి లొకేషన్ షేర్ చేసి, పిల్లలను నడుముకు కట్టుకుని చెరువులోకి దూకింది. చెరువు వద్ద సిబ్బంది చెరువులో గాలించి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అయితే, కూతురు, మనవరాళ్లు చనిపోయారని తెలిసినా మమత తల్లిదండ్రులు అక్కడికి రాకపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

