DYSO Ashok kumar | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 13 : మారుమూల తండా నుంచి మలేషియాకు వెళ్తున్న జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మహమ్మద్ అజీజ్‌ఖాన్ అన్నారు. శనివారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో గుగులోతు అశోక్‌కుమార్ మలేషియాలో జరిగే అంతర్జాతీయ సెమినార్‌కు వెళ్తున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అజీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మారుమూల తండా రతిరాం తండాలో జన్మించిన అశోక్‌కుమార్ రెజ్లింగ్ క్రీడా కోచ్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని, క్రీడలో అత్యున్నత స్థాయి వరంగల్ నిట్ నుంచి ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ దగ్గర పీహెచ్డీ చేయడం ఈ క్రమంలోనే మలేషియాలో జరిగే అంతర్జాతీయ సెమినార్‌కు వెళ్తున్నారని చెప్పారు. అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలో క్రీడా స్టేడియాల అభివృద్ధి జరుగుతుందని గుర్తుచేశారు.
అథ్లెటిక్స్అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ.. హనుమకొండ డీవైఎస్ఓ అశోక్‌కుమార్ అంతర్జాతీయ సెమినార్‌కు వెళ్లడం ఆనందదాయకమని, అశోక్ సారథ్యంలో జిల్లా క్రీడాకారులు రాష్ర్ట, జాతీయస్థాయిలో దూసుకుపోతున్నారని అభినందించారు.
రెజ్లింగ్ క్రీడావ్యాప్తికి విశేషంగా కృషి..
రెజ్లింగ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. అశోక్‌కుమార్ రెజ్లింగ్ క్రీడావ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నారని, ఆయన ఎక్కడ పనిచేసినా ఆ జిల్లా రెజ్లింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దారని అభినందించారు. అనంతరం వివిధ క్రీడా సంఘాలు, కోచ్‌లు అశోక్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి లిల్లీ ఫ్రాన్సిస్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ రాజలింగం, వివిధ క్రీడా అసోసియేషన్ల సభ్యులు, కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!