వేలేరు : హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్లలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గట్టు మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆహ్వానం పలికారు.
ఆలయ అర్చకులు మహేష్ శర్మ బుధవారం జనగామ కేంద్రంలోని ఎమ్మెల్యే పల్లా క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 15న ఆలయంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సాంబరాజు, నాయకులు ఇట్టబోయిన సంపత్ తదితరులు పాల్గొన్నారు