హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 14 : ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 50 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు సాంకేతిక విద్యనందించిన ఈ ఐటీఐకి నూతన భవనం అవసరం ఎంతో ఉందన్నారు.
వరంగల్‌లో నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించాలంటే పరిశ్రమలు, రైల్వేలు, ఇతర సంస్థల్లో అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్‌ఖాన్, మాజీ కార్పొరేటర్లు విజయలక్ష్మి సురేందర్, జక్కుల రవీందర్, బోడ డిన్నా, డివిజన్ అధ్యక్షులు సంగీత్, నాయకులు అంబేద్కర్ రాజు, గోల్కొండ సాంబయ్య, సృజన్, క్రాంతి పాల్గొన్నారు.