హనుమకొండ చౌరస్తా, మార్చి 4 : ప్రభుత్వ పథకాల అమలులో లీడర్ అయినా క్యాడర్ అయినా పైసలు వసూలు చేస్తే పని ఖతమేనని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini) హెచ్చరించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి ముగుస్తున్న క్రమంలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల మంజూరు అయ్యాయని, లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే నాయిని తెలిపారు. ప్రతి డివిజన్ పరిధిలో అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ప్రతి నాయకుడు వార్డులలో ప్రతిరోజూ పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎక్కడైనా నిర్లక్ష్యం చేసినా, పైసలు వసులు చేసినా సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పోతుల శ్రీమన్, మామిండ్ల రాజు, సయ్యద్ విజయ శ్రీ రాజాలి, మానస రాంప్రసాద్, నెక్కొండ కవిత కిషన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మా రెడ్డి, అంబేద్కర్ రాజు, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్, జిల్లా ఆర్టీఏ సభ్యులు పల్లకొండ సతీష్ పాల్గొన్నారు.