Blood donation camp | క్రెడాయి రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో క్రెడాయి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
హనుమకొండ, అక్టోబర్ 12: హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో క్రెడాయి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికిపైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
నిర్మాణ రంగంలో విశేష సేవలందిస్తున్న క్రెడాయి సంస్థ సామాజిక బాధ్యతను కూడా అలవరుచుకుంటూ రక్తదాన వంటి కార్యక్రమాలు చేపట్టడాన్ని ఎమ్మెల్యే నాయిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ఒక గొప్ప పుణ్యకార్యమని, ఇలాంటి కార్యక్రమాలకు యువత పెద్దఎత్తున ముందుకురావడం ఆనందకరమన్నారు. క్రెడాయి సంస్థ నిర్మాణ రంగంతో పాటు సామాజిక సేవలోనూ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో క్రెడాయి వరంగల్ అధ్యక్షులు నాయిని అమరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాఖమూరి అమర్, క్రెడాయి చైర్మన్ తిరుపతిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎం.రవీందర్‌రెడ్డి, ఎల్.రజనీకాంత్‌రెడ్డి, జి.రాజేందర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలు కొండారెడ్డి, నాగరాజు, వెంకట మల్లారెడ్డి, కోశాధికారి వరుణ్ అగర్వాల్, ఈసీ సభ్యులు రిషిన్రెడ్డి, మనోహర్, సి.సందీప్, బాబురావు సభ్యులతో పాటు, నగర ప్రముఖులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

