హనుమకొండ : కలెక్టర్ సమక్షంలోనే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..ఐనవోలు మండలం కేంద్రంలో భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వేదిక పైన ఉండగానే ఎమ్మెల్యే స్వయంగా మైక్ తీసుకొని మరి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడుతో మొదలుకొని.. కార్యకర్త వరకు సభ వేదిక పైన కూర్చొపెట్టే కార్యక్రమం అంత కలెక్టర్ సమక్షంలోనే చేపట్టడం విస్మయానికి గురి చేసింది.
కాంగ్రెస్ పార్టీ మీటింగా లేక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే అవగాహన ప్రోగ్రామా? అనేది సభలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్రమశిక్షణ మారు పేరుగా ఉన్న పోలీస్ శాఖలో పోలీసు కమిషనర్ గా విధులు నిర్వహించిన వ్యక్తే ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన కార్యక్రమాలకు పాల్పడడం విడ్డూరంగా మారిందని సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకోవడం గమనార్హం.