ఖిలా వరంగల్ : గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్ లో అభివృద్ధి పనులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం శ్రీకారం చుట్టారు. శివనగర్ ప్రాంతంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అలాగే మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్‌కు సంబంధించిన అభివృద్ధి పనులను ఆమె మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ తో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లో సుమారు రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, మరో రూ.50 లక్షలతో మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
మొత్తం రూ.కోటి రూపాయల జనరల్ ఫండ్ నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు.
తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని, ముఖ్యంగా డ్వాక్రా సంఘాల మహిళలకు ఉపాధి శిక్షణ కేంద్రంగా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల నవీన్ రాజ్, కొతపెల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్, డివిజన్ అధ్యక్షులు రేణికుంట్ల శివ, శ్రీరామ్ రాజేష్, సోమన్న, కొత్తూరి రాజు, పురేల్లి సతీష్, మల్లారెడ్డి, మాజీ కార్పొరేటర్ కామిశెట్టి కోటేశ్వరమ్మ, కాపు సంఘం అధ్యక్షులు తోట శ్రీనివాస్, ఈఈ సంతోష్, డీఈ ముజమిళ్, ఏఈ పనికుమార్ తదితరులు పాల్గొన్నారు.