హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 23: హనుమకొండ బస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో కుడా లేఅవుట్లోని 1066 సర్వేనెంబర్లో విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకే వేలంపాట వేయడాన్ని నిలిపివేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.చుక్కయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నున్నా అప్పారావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏదునూరి వెంకట్రాజం, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి ఎన్రెడ్డి హంసరెడ్డి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడారు.
ముందుతరాలకు భూమి ఎంతో అవసరమని, బంగారం కంటే ప్రియమైన భూముల రేట్లును అందుకో లేకపోతున్నట్లు నగరపాలక సంస్థకు డబ్బులే అవసరమైతే ఇతర మార్గాలు అన్వేషించాలన్నారు. రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవాలి అంతేకానీ ఆస్తులు అమ్మకూడదన్నారు. అంబేద్కర్ విగ్రహం సమీపంలోని పాత మున్సిపల్ గెస్ట్‌హౌస్‌ను కూడా ఎలాంటి వేలంపాట లేకుండా కార్పొరేటర్ వేముల శ్రీనివాస్‌కు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని నున్నా అప్పారావు మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వ భూముల వేలంపాటలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 30న కాళోజీ జంక్షన్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు బొట్ల చక్రపాణి, గొడుగు వెంకట్, సీపీఐ నాయకులు కొట్టిపాక రవి, మద్దెల ఎల్లేష్, ఎంసీపీఐ కర రాజిరెడ్డి, చీపుర ఓదయ్య పాల్గొన్నారు.