గీసుగొండ, జూన్ 06 : కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలను పురస్కరించుకొని స్వామివారికి 108 కలశాలతో అభిషేకంతో పాటు లక్ష పుష్పార్చన వేడుకలు ఈవో నాగేశ్వరరావు, అర్చకులు కాండూరి రామాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు వరంగల్ పట్టణం నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకం, పుష్పార్చన వేడుకలలో పాల్గొన్నారు.
నరసింహ స్వామి ఆలయంలో మొట్టమొదటిసారిగా 108 కళాషాల అభిషేకం, పుష్పార్చన వేడుకలు జరగడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు . వేడుకల అనంతరం ఆలయ అధికారులు, భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాసచార్యులు, అర్చకులు విష్ణుచార్యులు, పనింద్ర ద్రాచార్యులు. ఆలయ మాజీ ఉత్సవ కమిటీ సభ్యులు లింగారెడ్డి, కడారి రాజు, రవీందర్ రెడ్డి, ప్రభాకర్ ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.