హనుమకొండ చౌరస్తా, జనవరి 12: కాకతీయ విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సి.జె.శ్రీలత 2025 సంవత్సరానికిగాను ‘ఇండియా మోస్ట్ ప్రాగమెటిక్ ఉమెన్ లీడర్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్-2025’ అవార్డుకు ఎన్నికయ్యారు. ఈ అవార్డును ఈనెల 10న బెంగళూర్‌లోని హయత్ సెంట్రిక్‌లో నిర్వహించిన ‘ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్ అండ్ సమ్మిట్’ కార్యక్రమంలో ప్రదానం చేసినట్లు ఆమె వెల్లడించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రంతో పాటు పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు శ్రీలతను అభినందించారు.