హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 3 : కాకతీయ విశ్వవిద్యాలయ పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
క్యాంపస్లో కంప్యూటర్ సైన్సు, వివిధ విభాగాలను ఆయన సందర్శించారు. ఆయనతో పాటు క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ కే.మమత, కంప్యూటర్ సైన్సు విభాగాధిపతి బి.రమ ఉన్నారు.