ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును కాపాడాలి : కూరపాటి వెంకటనారాయణ
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును కాపాడాలి అని ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 7: తెలంగాణ రాష్ర్టంలో మూడు నెలల నుంచి ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ జరుగుతున్న సందర్భంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు, పౌర సమాజం, యువజన సంఘాలు, విశ్రాంత ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, సామాజిక చైతన్య సంస్థలు, వేదికలు, వాకర్ సంఘాలు, అత్యంత జాగ్రత్తతో 18 సంవత్సరాల పైబడిన యువతీ యువకుల నుండి అత్యంత వృద్ధులైన వారి ఓట్లను కాపాడవలసిన బాధ్యతను గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ర్ట చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ‘సర్’ సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎన్నికల్లో ధనవంతులు ఓటు హక్కును ఉపయోగిస్తారని కేవలం పేద వర్గాలు మాత్రమే ప్రభుత్వాల తలరాతలు నిర్ణయిస్తారని అలాంటి ఓట్లు జాబితా నుండి గల్లంతు కాకూడదన్నారు. సంక్లిష్టమైన ఓటర్ నమోదు ఫారం నింపే అవగాహనలేని ఓటర్లు అత్యధికంగా ఉన్న విషయాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారులు, నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారులు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు బొమ్మినేని పాపిరెడ్డి, సాయిని నరేందర్, డాక్టర్ రాజ్ మహ్మద్, వీరమల్ల బాబురావు, పుల్లూరు సుధాకర్, సోమ రామమూర్తి, దొమ్మాట ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

