KIshan Reddy | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 29 : చారిత్రక వేయి స్తంభాల దేవాలయ కళ్యాణ మండపం పనులు ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని, గడిచిన 2 సంవత్సరాలు ఏం చేస్తున్నారని ఆర్కియాలజీ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన వేయి స్తంభాలదేవాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్ర పురావస్తుశాఖ రాష్ట్ర సూపరింటెండెంట్ నిహిల్దాస్, ఆర్కియాలజీ విభాగం డిప్యూటీ ఇంజినీర్ క్రిష్ణచైతన్య, జిల్లా అధికారి అజిత్, ఇంటాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి.అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వైదిక సిబ్బంది వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి నందీశ్వర దర్శనం కల్పించి, ఆలయంలోని ఉత్తిష్ఠ గణపతి దర్శనం కల్పించి రుద్రేశ్వరస్వామికి పంచామృతాలతో రుద్ర అధ్యాయంతో రుద్రాభిషేకం నిర్వర్తించారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవసా్త్రలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.
2 సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు..?
ఈ సందర్భంగా కేంద్ర పురావస్తుశాఖ, టూరిజం శాఖ మంత్రి గజేంద్రసింగ్ శేఖావత్తో చర్చించి నిధులు మంజూరు చేయించాలని ఆలయ కార్యనిర్వాహణాధికారి అనిల్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కళ్యాణ మండపాన్ని సందర్శించి ఇంకా 5 శాతం జరగలేని పనులపై ఎందుకు పూర్తి చేయలేదని, గడిచిన 2 సంవత్సరాలు ఏం చేస్తున్నారని వేయిస్తంభాల గుడి ఆర్కియాలజీ అధికారులపై మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేయిస్తంభాల గుడి ఆర్కియాలజీ అధికారులపై మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి కళ్యాణమండపం పనుల నిర్లక్ష్యంపై 6 నెలలకాలం నుంచి ఏం చేస్తున్నారంటూ, సంవత్సరాలు గడుస్తున్నా పనులు జరగకపోవడంపై మండిపడ్డారు. వర్కర్ల పనితీరును ప్రశ్నించి, పర్యవేక్షకుడిగా ఆర్కియాలజీ అధికారి వివరణ అడిగిన మంత్రి దేవాలయం పనులపై పూర్తి నివేదిక ఇవ్వాలని కిషన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆలయ కేంద్ర పురావస్తుశాఖ కార్యాలయంలో సంబంధిత పురావస్తుశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం తరుఫున భక్తులకు సౌకర్యాలు..
రామప్ప దేవాలయానికి ప్రసాద పథకం కింద టూరిజం అండ్ ప్రసాద్ పథకం కింద రూ.72 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని, ఆ పనులు కూడా నత్తనడకన జరుగుతున్నాయని ఆ పనుల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీ రాబోతున్నారని చెప్పారు. వరంగల్ కోటలో శంభునిగుడి రాష్ట్ర ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో విషయాన్ని గమనిస్తూ అభివృద్ధి చేయడానికి డీపీఆర్ సిద్ధం చేయాలని రామప్పను యునెస్కోలో చేర్చిన తర్వాత దేవాలయానికి దేశ, విదేశస్తులు వస్తున్నారని టూరిజం పరంగా రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరుఫున భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వేయిస్తంభాల దేవాలయ అభివృద్ధికి నిధులు ఉన్నాయని గార్డెనింగ్, సెంట్రల్ లైటింగ్, వాకింగ్ ప్లాట్ వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఆరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఘంటా రవికుమార్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బీజేపీ నాయకులు రావుల సుదర్శన్, మిద్దెల బాబు, గండ్రాతి రాజు పాల్గొన్నారు.

Dalit Cook: దళిత మహిళను వంట చేయకుండా అడ్డుకున్న ఆరుగురికి జైలుశిక్ష
Deeksha Divas | తెలంగాణ భవన్లో దీక్షా దివస్.. దీక్షా దివస్‌పై డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కేటీఆర్
Ditwa cyclone | దిత్వా తుఫాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. Video