Thousand Pillers Temple | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 4 : చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకల సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వరంగల్ జిల్లా 5వ జోన్ ఉపకమిషనర్ సంధ్యారాణి అన్నారు. మంగళవారం ఆమె వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి రుద్రేశ్వరస్వామి వారికి మహాబిల్వార్చన నిర్వర్తించిన అనంతరం ఆలయ నాట్యమండపంలో స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించి మహాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న కార్తీక పౌర్ణమి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉపకమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. కార్తీకపౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లను లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లను, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని, భక్తులు ఆధ్యాత్మిక భావనతో క్యూపద్ధతి పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు అన్ని చేశామని తెలిపారు. వారి వెంట ఆలయ కార్యనిర్వాహణాధికారి డీ అనిల్‌కుమార్, ఆలయ అర్చకులు సిబ్బంది ఉన్నారు.
Rain Alert | ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
Pardipuram | పర్దిపురంలో రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన : వీడియో