హనుమకొండ చౌరస్తా, మార్చి 17: ఈనెల 18 నుంచి 20 వరకు ఛండీఘర్లోని పంజాబ్ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా యూనివర్సిటీ జిమ్నాస్టిక్ మెన్స్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ టీంను ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్ బోర్డు కార్యదర్శి ఏ.వెంకయ్య తెలిపారు.
ఇందులో హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి జే.జీవన్‌కుమార్, వి.రాల్, ఎస్.లక్ష్మణ్, డివినయ్కుమార్, హనుమకొండ వాగ్దేవి కాలేజీ నుంచి ఎం.విష్ణువర్ధన్ ఉన్నట్లు, వీరికి బొల్లికుంట వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ పీడీ వి.రామాంజనేయులు మేనేజర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు.