హనుమకొండ, నవంబర్ 14: కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం ద్వారా ఆగస్టు నెలలో నిర్వహించిన డిగ్రీ వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. శుక్రవారం కేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రంతో కలిసి విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ ఫలితాలను ప్రకటించారు.
ఫలితాల వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ సైట్లో www.kakatiya.ac.in లో లభ్యమవుతాయని రాజేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దూరవిద్య సంచాలకుడు బి.సురేష్‌లాల్, అదనపు పరిక్షల నియంత్రణ అధికారిణి ఎం.తిరుమలదేవి, జి.పద్మజ, అసిం ఇక్బాల్ పాల్గొన్నారు.