హనుమకొండ చౌరస్తా, నవంబర్ 27: కాకతీయ విశ్వవిద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయని వెంటనే యూనివర్సిటీ అధికారులు పరిష్కరించాలని కేయూ నూతన జేఏసీ చైర్మన్‌గా కేయూ పరిశోధక విద్యార్థి బొచ్చు తిరుపతి డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయం వద్ద గురువారం ఏ.బి.ఎస్.ఎఫ్, బీ.సీ విద్యార్థి సంఘం, బి.ఎస్.ఎఫ్, ఎం.ఎస్.ఎఫ్,ఎస్.ఎస్.యు ,డీ.ఎస్.ఏ ,ఎస్.ఎస్.బి.ఎం, డి.ఎస్.యూ,సేవలాల్ విద్యార్థిసేన, మాదిగ విద్యార్థి వేదిక సంఘాల ఆధ్వర్యంలో నూతన జేఏసీని ఎన్నుకున్నారు.
నూతన విద్యార్థి జెఏసీ చైర్మన్‌గా జీవ సాంకేతిక శాస్ర పరిశోధక విద్యార్థి బొచ్చు తిరుపతిని ఏక గ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ విద్యార్థుల నిరుద్యోగుల సంక్షేమం కోసమే జేఏసీ ఏర్పాటు చేశామమని, రాష్ర్ట ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నూతన జీఏసీ వైస్ చైర్మన్ గా కామగాని శ్రవణ్‌కుమార్, కేయూ జేఏసీ కన్వీనర్‌గా బొట్ల మనోహర్, కో-కన్వీనర్‌గా ఎల్తూరి సాయికుమార్, పెండాల రాకేష్‌ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. గతంలో ఉన్న జేఏసీలను రద్దు చేశామని, ప్రస్తుత జేఏసీ నేటి నుంచి కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేశ్, ఉప్పల శివ, రాజేశ్, కిరణ్, సాయి, పల్లవి, స్నేహలత, ప్రసన్న, అపర్ణ, దివ్య పాల్గొన్నారు.