హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్న విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుమాలిన చర్య అని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బొచ్చు తిరుపతి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ అతిథి గృహంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(ఎంఎస్ఎఫ్) కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు కుమ్మరి శ్రీనాథ్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఆయన మాట్లాడారు. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపచేటు, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు.
టీజీపీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల మీద ఉన్న శ్రద్ధ విద్యరంగా సమస్యల మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే రాష్ర్టంలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాలను ఎదుట మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ర్ట ప్రచార కార్యదర్శి ముక్కెర ముకేష్ మాదిగ, వరంగల్ జిల్లా అధ్యక్షులు చింతం సిద్ధూ మాదిగ, అధికార ప్రతినిధి మారపల్లి రాణాప్రతాప్ మాదిగ, అడ్డూరి గణేష్ మాదిగ, సూర్యప్రకాశ్ మాదిగ, పార్ధు మాదిగ, కార్తిక్, అజయ్ పాల్గొన్నారు.