హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: సుబేదారిలోని కాకతీయ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా 60వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ దాస్యం అభినవ్భాస్కర్ పాల్గొని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల విద్యార్థులలో విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందని అభినందించారు.
ఇలాంటి విద్యాసంస్థలు సమాజానికి మంచి పౌరులను అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ, ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని కృషి చేస్తే విజయం సాధ్యమవుతుందని సూచించారు. ప్రిన్సిపాల్ శంకర్, టీచర్లు సరస్వతి, లావణ్య, ప్రియదర్శిని, ప్రవీణ్, సుల్తానా, సంధ్యారాణి, గౌస్ పాషా, రమేష్, అమూల్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.