జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్లో నిర్వహించే రైతుసదస్సు కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రేగొండ మండలం కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, వెంటనే మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టి ప్రభుత్వం మేడలు వంచి రైతులకు న్యాయం చేకూరేలా కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.