హనుమకొండ చౌరస్తా, జనవరి 18: ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక విధానాలను ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి ప్రభాకర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కార్యాలయం రాంనగర్ సుందరయ్య భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశం దూడపాక రాజేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భందగా మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తిస్థాయిలో పెట్టుబడిదారీ విధానాలకు అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తుందన్నారు. అధికారంలోకి రాకముందు దేశంలో యువకులకి డిజిటల్ ఇండియాగా మారుస్తానని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగావకాశాలని కల్పిస్తామని భారత్ వెలిగిపోతుంది, అభివృద్ధి అవుతుందని బాకాలు ఊదారు.
గత ప్రభుత్వం చేసిన చట్టాలని మార్చివేస్తూ పూర్తిస్థాయిలో గ్రామీణ పేదలకి, పట్టణ పేదలకు రోజువారి కూలీలకి అన్యాయం చేసే విధంగా వారి పరిపాల న కొనసాగుతుందని మండిపడ్డారు.
బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అర్థం చేసుకొని భవిష్యత్తు పోరాటాలకి యువత సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు మంద సంపత్ కార్యకర్తలు బొల్లారం సంపత్, ఆలకుంట మల్లయ్య, చెరుపెల్లి కుమారస్వామి, సప్పిడిమనోహర్, నేతగాని భారతి, ఎండి రజియా, నగర కంటి సుకర్ణ ,శ్వేత, స్రవంతి,పాలకొండ శ్రీకాంత్, పొట్లపల్లి రాజు, తుపాకుల సుధాకర్, రేణిగుంట్ల చందర్, అనిల్ కర్ణాకర్ పాల్గొన్నారు.