హనుమకొండ రస్తా, జూలై 30 : తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో (ముస్లిం, కైస్తవులు, సిక్కులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు) చదువుకున్న యువతకు నాలుగు నెలల ఫౌండేషన్ కోర్సు కింద ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులకు చివరి తేదీ 21 ఆగస్టు వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కేఏ గౌస్ హైదర్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రూప్-1, 2, 3, 4, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, సమీప భవిష్యత్లో జరగబోయే ఇతర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, విజయం పొందేందుకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన మైనార్టీ నిరుద్యోగ యువత అవసరమైన సర్టిఫికెట్లు దరఖాస్తుతో జతచేసి ఆగస్టు 21లోపు జిల్లా మైనార్టీస్ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం, ఐడీవోసీ, రూం నెంబర్-ఎస్9, రెండో అంతస్తు, కలెక్టరేట్లో సమర్పించాలని, ఇతర వివరాలకు 95504 49464 నెంబర్ను సంప్రదించాలని కోరారు.