మహబూబాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లా కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతపై మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర నాయకులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు.
వారివెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మర్నేని వెంకన్న, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, గద్దె రవి, తెల్ల శ్రీనివాస్, యాళ్ల మురళీధర్ రెడ్డి, ముత్యం వెంకన్న గౌడ్, నాయని రంజిత్, మహబూబ్ పాషా, సుధగాని మురళి,
ఎండీ ఫరీద్, మర్నేని రఘు, సలీం, నల్లని నవీన్ రావు, అసిఫ్ అలీ, బొడ లక్ష్మణ్, మానాది రాజేష్ తదితరులు పాల్గొన్నారు.