హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుచేసి పంటలు పండిస్తే కొనుగోలు చేపట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో మొక్కజొన్న రైతుల ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రం తెరిచినా నెల రోజుల నుండి గోస పుచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంటాలు వేసినా కొనుగులు చేయడంలేదని, మళ్లీ వర్షాలు వస్తే తీవ్ర స్థాయిలో నష్టపోతామని వాపొతున్నారు. ఈ మేరకు మహబూబాబాద్ – తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాంమ్ ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను బుజ్జగించి ధర్నాను విరమించే ప్రయత్నం చేశారు.