హసన్పర్తి : ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు దేవన్నపేట నుంచి ఎడ్ల బండ్లతో అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అనంతరం దేవన్నపేటలో ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎలుకతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మీటింగ్తో కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టాలన్నారు.