హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 22 : 42 శాతం బిసి రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని బీసీ ఇంట లెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమ కొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ధర్నా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూరపాటి రమేశ్ మాట్లాడుతూ బీసీ సాధన సమితి పిలుపుమేరకు కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వాగ్దానం మేరకు బీసీలకు 42 శాతం విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ర్టప్రభుత్వం రెండు వేర్వేరు బల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపగా దాన్ని కేంద్రానికి పంపడం జరిగిందన్నారు.
అక్కడ ఆ రెండు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈలోపు రాష్ర్ట ప్రభుత్వం మళ్లీ కేవలం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ప్రత్యేకంగా పరుచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపగా దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడం జరిగిందన్నారు. చివరగా జీవో తీసుకొచ్చి ఎన్ని కలను 42 శాతం రిజర్వేషన్లతో నిర్వహించాలని ప్రయత్నించగా హైకోర్టులో కేసువేసి అడ్డు కోవడమైందన్నారు.
ఈ క్రమంలో విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధించడానికి ఏకైక పరిష్కారం ఉద్యమమేనని నిర్ణయానికొచ్చిన బీసీ ఐఎఫ్ వ్యవస్థాపకులు చిరంజీవులు, చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య, బాలరాజ్‌గౌడ్, డాక్టర్ విశారదన్‌తో కలిసి 42 శాతం రిజర్వేషన్ల సాధన సమితిని స్థాపించి 24న ఇందిరాపార్క్ వద్ద ఒకరోజు మహాధర్నా చేపట్టనున్నట్లు చెప్పారు. bఈ ధర్నాను బీసీ సమాజమంతా విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కోర్ కమమిటీ సభ్యులు ప్రొఫెసర్ విజయబాబు, ప్రొఫెసర్ సీహెచ్.రాములు, కె.వీరస్వామి, ఏ.తిరుపతి, కొలిపాక ప్రకాశ్, కె.విక్రమ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ తరుఫున ఉమ్మడి జిల్లా ఛైర్మన్ డాక్టర్ చందా మల్లయ్య కో-ఆర్డినేటర్లు పొదిలసాయిబాలు, మేకల సుమన్, చక్క సురేష్, కె.నాగరాజు పాల్గొన్నారు.