Khila warangal | బాలికలకు రీయూజబుల్ సానిటరీ కిట్స్ పంపిణీ
శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్, ఎస్బీఐ సహకారంతో బాలికలకు రీయూజబుల్ సానిటరీ కిట్స్‌ను అందజేశారు.
ఖిలావరంగల్, మార్చి 16: శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్, ఎస్బీఐ సహకారంతో సోమవారం 8, 9, 10వ తరగతుల్లో చదువుతున్న సుమారు 100 మంది బాలికలకు దాదాపు రూ.65 వేల విలువైన రీయూజబుల్ సానిటరీ కిట్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ అధ్యక్షుడు గణేష్ కుమార్ మాట్లాడుతూ బాలికలు రుతుక్రమం గురించి భయపడకుండా, బాధపడకుండా ఉండాలన్నారు.
అది జీవన చక్రంలో సహజమైన భాగమని అర్థం చేసుకుని పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఆరోగ్యకర మైన సమాజ నిర్మాణంలో బాలికల ఆరోగ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు.
ప్రధానోపాధ్యాయులు నరేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ సాధనలో రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు. బాలికల ఆరోగ్య అవగాహన కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు సదానందం, హరినాథ్, కుమారస్వామి, అనిల్ కుమార్, ఉపాధ్యాయులు దేవరాజు, అంజయ్య, భవాని, లక్ష్మీనారాయణతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

