కోనరావుపేట, ఆగస్టు 10 : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు నిరసన సెగ తగిలింది. సోమవారం ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తుండగా.. వట్టిమల్ల గ్రామంలో సర్పంచ్ వెంకటేశ్‌గౌడ్, స్థానికులు, రైతులు అడ్డుకున్నారు.
గ్రామంలోని మూలవాగులో లోలెవల్ బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమైందని, ప్రతి వానకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. వట్టిమల్ల-నిమ్మపల్లి గ్రామాల మధ్యలోని మూలవాగులో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.14కోట్లు మంజూరయ్యాయని.. త్వరలో పనులు ప్రారంభిస్తామని విప్ తెలిపారు.