NIT | డైరెక్టర్ శైలేష్ కొలనుతో చిట్‌చాట్.. నిట్‌లో స్ప్రింగ్ స్ప్రీ స్పెషల్ ఈవెంట్స్ ఇవే
NIT | స్ప్రింగ్ స్ప్రీ విద్యార్థుల సృజనాత్మక ఆత్మస్ఫూర్తి, సాంస్కృతిక ఉత్సాహానికి ప్రతీక, ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ప్రతిభ, జట్టు భావం, నాయకత్వానికి వేడుకగా నిలుస్తుందన్నారు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి.
NIT | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 25 : నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఈ నెల 27,28వ తేదీల్లో వార్షిక సాంస్కృతిక మహోత్సవం స్ప్రింగ్ స్ప్రీ-2026 నిర్వహించనున్నారు. సంగీతం, సినిమా, కళలు, సాహిత్యం, విద్యార్థుల సృజనాత్మకతకు కేంద్రబిందువుగా క్యాంపస్‌ను మార్చనుంది. భవ్యమైన ప్రో షోలు, ప్రముఖులతో పరస్పర సంభాషణలు, 40కిపైగా విభిన్న క్లబ్ ఈవెంట్లతో ఈ ఏడాది సంచిక ఇటీవలి కాలంలో అత్యంత చురుకైన, వృత్తిపరంగా రూపొందించిన ఉత్సవాల్లో ఒకటిగా నిలవనుంది. ప్రధాన గేటు నుంచి ప్రధాన భవనం వరకు, అలాగే క్యాంపస్‌లోని కీలక ప్రదేశాలన్నింటిని ఏకరూపమైన స్వర్ణవర్ణ అలంకరణలు వెలిగిస్తున్నాయి. ఇవి సంబరాన్ని, ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ప్రధాన ఉత్సవానికి ముందే ఉత్సాహాన్ని పెంచుతూ.. స్ప్రింగ్ స్ప్రీ చరిత్ర సృష్టించింది. సంప్రదాయ ప్రారంభ దినం (26వ తేదీ)కి ముందే స్వతంత్రంగా నిర్వహించిన తొలి ‘కర్టెన్ రైజర్’కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. 40 అడుగుల ఎత్తైన ఉత్సవ బ్యానర్‌ను ఆవిష్కరించగా, 5 నిమిషాల పాటు సాగిన అద్భుతమైన బాణసంచా ప్రదర్శన క్యాంపస్ ఆకాశాన్ని వెలిగించింది. అనంతరం నిర్వహించిన ‘ఎథ్నిక్ నైట్’ ఈ ఏడాది సాంస్కృతిక మహోత్సవానికి ఘనమైన, అపూర్వ ఆరంభాన్ని ఇచ్చింది.
ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి మాట్లాడుతూ.. స్ప్రింగ్ స్ప్రీ విద్యార్థుల సృజనాత్మక ఆత్మస్ఫూర్తి, సాంస్కృతిక ఉత్సాహానికి ప్రతీక, ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ప్రతిభ, జట్టు భావం, నాయకత్వానికి వేడుకగా నిలుస్తుందన్నారు.
స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. స్ప్రింగ్ స్ప్రీ 2026కు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సహా వేలాది మంది అంతర్గత భాగస్వాములు పాల్గొననున్నారని, స్టేడియం, ఆడిటోరియం, ఎస్ఏసీ, ఏఎల్సీ, అకడమిక్ భవనాల్లో ఒకేసారి అనేక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. స్ప్రింగ్ స్ప్రీ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కెఎస్ రాజమోహన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రోషోలలో మొదటిరోజు స్టేడియంలో జోనితాగాంధీ, రెండోరోజు రణీనారెడ్డి ప్రదర్శనలు ఉంటాయని, ప్రారంభ కార్యక్రమంలో అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీ టీమ్‌తో ఇంటరాక్షన్ ఉంటుందని అలాగే ‘డైరెక్టర్స్ కట్’ సెషన్ల ద్వారా సినీ ప్రపంచంపై అవగాహన అందించబడుతుందన్నారు.
ఈవెంట్ల ప్రదర్శన..
స్ప్రింగ్ స్ప్రీ 2026లో విద్యార్థుల ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఓపెన్ మైక్ అండ్ అన్ ప్లగ్డ్ ప్రదర్శనలు, క్యాంపస్‌లో దాగి ఉన్న ప్రతిభకు వేదిక, డైరెక్టర్స్ కట్ అండ్ ఫిల్మ్ హౌస్ సెషన్లు(సినిమా ప్రేమికుల కోసం), కరాకే నైట్ అండ్ మ్యూజిక్ క్లబ్ ప్రదర్శనలు, సిరీన్ షేడ్స్ అండ్ నియాన్ ఎన్ షాంటే, కళా ఇన్ స్టాలేషన్లు, ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ అండ్ పోలరాయిడ్ షోకస్, కోరియో నైట్ (ప్రో షో స్టేజ్ప్జె), ట్రెజర్ హంట్ అండ్ మిస్టరీ మేజ్ పోటీలు, బీట్ బ్యాటిల్ అరేనా అండ్ సంగీత ప్రదర్శనలు, సృజనాత్మక కళల నుంచి సాహిత్య పోటీల వరకు ప్రతి అభిరుచికి తగిన కార్యక్రమాలు ఈ ఉత్సవంలో ఉన్నాయి.
సంగీతం, సినిమా, సంస్కృతి అండ్ సృజనాత్మకతతో నిట్ వరంగల్ ను ఉత్సాహపరచేందుకు సిద్ధమైన స్ప్రింగ్ స్ప్రీ 2026 జోనితా గాంధీ అండ్ రణీనారెడ్డితో జాతీయస్థాయి ప్రోషోలు, ‘డైరెక్టర్స్ కట్’ దర్శకుడు శైలేష్ కొలనుతో ఇంటరాక్టివ్ సెషన్, ప్రముఖులతో పరస్పర సంభాషణలు, క్యాంపస్‌లో ‘డెకాయిట్’ ఆడియో సాంగ్ లాంచ్, ‘స్వయంభూ’ మూవీ టీమ్ ఇంటరాక్షన్ ఉంటుందన్నారు. ఐదు వేదికల్లో సుమారు 50 మంది విద్యార్థుల నేతృత్వంలో నిర్వహించే సాంస్కృతిక, సృజనాత్మక కార్యక్రమాలు స్వర్ణవర్ణ థీమ్ అలంకరణలతో క్యాంపస్ వెలిగిపోతున్నదన్నారు.

Read Also :
Virosh | చదువులోనూ టాపర్స్… స్టార్ కపుల్ విజయ్ – రష్మిక ఎడ్యుకేషన్ డిటేల్స్ వైరల్
Virosh Star Kids | నటన వద్దు.. దర్శకత్వమే ముద్దు: మెగా ఫోన్ పడుతున్న స్టార్ కిడ్స్!
Ayasher Song | నాని ‘ఆయాషేర్’ దెబ్బకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఔరా గల్లంతు!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

