హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 4 : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌లో వివిధ కాలేజీల్లో బుధవారం ఉదయం 6 సైక్లింగ్ రేస్‌ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం, స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ఏ.వెంకయ్య ప్రారంభించారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులను మహారాష్ర్ట ఎంజీఎం యూనివర్సిటీలో జరుగబోయే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ సైక్లింగ్ రోడ్ రేస్ పంపించడం జరుగుతుందని వెంకయ్య తెలిపారు.
ఈ సెలక్షన్స్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కేయూ ప్రెసిడెంట్ సోమన్న, వైస్ ప్రెసిడెంట్ రమేష్, ట్రెజరర్ ఎస్.కిరణ్‌గౌడ్, పీడీలు కిషన్, ఆంజనేయులు, మట్టెడ కుమారస్వామి, సుమన్ పాల్గొన్నారు.